చిరంజీవిగారి ఇంట్లో నుంచి బయటికి అడుగుపెడుతూనే పెద్దగా ఏడ్చేశాను: 'సుడిగాలి' సుధీర్

  • చిరంజీవిగారిని గృహప్రవేశానికి ఆహ్వానించడానికి వెళ్లాను 
  • ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు 
  • కొత్త బట్టలు .. గిఫ్ట్ ఇచ్చారు 
కమెడియన్ గా .. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న 'సుడిగాలి' సుధీర్, తన జీవితంలో తనకి ఎదురైన ఒక అందమైన జ్ఞాపకాన్ని గురించి ప్రస్తావించాడు. "నేను కొత్తగా ఇల్లు కొనుక్కుని, గృహప్రవేశానికి చిరంజీవిగారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో మా తమ్ముడు కూడా నా పక్కనే వున్నాడు.

 చిరంజీవిగారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలరించారు. ట్రేలో పాలు తెప్పిస్తే నేను తాగడానికి మొహమాట పడుతున్నాను. దాంతో ఆయనే స్వయంగా కలిపి ఇవ్వడంతో, ఇక ఈ జన్మకి ఇది చాలు అనుకున్నాను. కొత్త బట్టలు .. గిఫ్ట్ తెప్పించి ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి అభిమానించే చిరంజీవి గారు నన్ను అంతటి ప్రేమతో చూడటంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. చిరంజీవిగారి ఇంట్లో నుంచి బయటికి వచ్చాక, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నది మా అమ్మా నాన్నలకి ఫోన్లో చెబుతూ పెద్దగా ఏడ్చేశాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Chiranjeevi
Sudheer

More Telugu News